APPSC Panchayat Secretary extended last date to apply online

APPSC extended last date to apply online for posts of Panchayat Secretary grade 4 in Andhra Pradesh

APPSC Group 3: ఏపీ పంచాయతీ సెక్రటరీ పోస్టుల (APPSC Panchayat Secretary )

దరఖాస్తుకు ఈరోజే ఆఖరు తేది

పంచాయతీ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ .

సమయం తక్కువగానే ఉంది అభ్యర్థులూ త్వరపడండి.

ముఖ్యమైన విషయాలు (Important Points):

28-01-2019 తో ఫీజు గడువు ముగిసింది

29-01-2019 తో ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు ముగుస్తుంది (29-01-2019 is the Last Date For Apply Online )

వివరాల కోసం https://psc.ap.gov.in ను చూడండి (For more Details please visit Official Website: https://psc.ap.gov.in)

ఆంధప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల దరఖాస్తుకు గడువు పెంచారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులకు గడువును పెంచినట్లు ప్రకటించింది.

పంచాయతీ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ ‘29-01-2019’కాగా.. ఫీజు చెల్లించేందుకు గడువు 28-01-2019 తో ముగిసింది.

అభ్యర్థుల నుంచి గడువు పెంచాలని విజ్ఞ‌ప్తి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1051 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించబోతోంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

పంచాయతీ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి.

దరఖాస్తు ఫీజుగా 250 రూపాయలు , పరీక్ష ఫీజుగా 80 రూపాయలు అభ్యర్థులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

మినహాయింపు ఎవరెవరికి ఉంటుంది:

ఎక్స్ సర్వీస్ మెన్(Ex Service Men), దివ్యాంగులు(Handicapped People), బీసీ,(BC) ఎస్సీ,(SC) ఎస్టీ(ST) అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి రెండు దశల రాతపరీక్షలు (Two Tier Examination Process.. Prelims and Mains)

ఏప్రిల్ 21న ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam, ఆగస్టు 2న మెుయిన్స్ పరీక్ష (Mains Exam)నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు (Posts Vacancies)

నెం జిల్లా పేరు పాత ఖాళీలు కొత్త ఖాళీలు మొత్తం పోస్టులు
1 శ్రీకాకుళం 7 107 114
2 విజయనగరం 1 119 120
3 విశాఖపట్నం 2 105 107
4 తూర్పుగోదావరి 12 92 104
5 పశ్చిమ గోదావరి 4 21 25
6 కృష్ణా 3 19 22
7 గుంటూరు 2 48 50
8 ప్రకాశం 5 167 172
9 నెల్లూరు 1 62 63
10 చిత్తూరు 7 134 141
11 అనంతపురం 3 38 41
12 కర్నూలు 2 88 90
13 కడప 2 0 2
మొత్తం 51 1000 1051

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *